KRNL: మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు?’ అని HYD సీపీ సజ్జనార్ ప్రశ్నించారు. ‘మీ సరదా, జల్సా కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు. వీరి కదలికలపై వెంటనే 100కు సమాచారం ఇవ్వండి. మాకెందుకులే అని వదిలేస్తే వారివల్ల చాలా ప్రాణనష్టం జరుగుతుంది’ అన్నారు.