GDWL: తెలంగాణలో ఓకే శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ క్షేత్రం రోజురోజుకు వివాదాలు, అన్యమతస్తుల అడ్డాగా మారుతోందని కొత్తకోట శివానంద స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. శృంగేరి జగద్గురువుల ధర్మ విజయ యాత్రలో భాగంగా భాగ్యనగరంలోని శంకరమఠంలో వారిని కలిసిన శివానంద స్వామి, అలంపూర్ క్షేత్ర వైభవాన్ని కాపాడేందుకు జగద్గురువుల ఆగమనం తప్పనిసరి అని విజ్ఞప్తి చేశారు.