CTR: బంగారుపాలెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు ఇప్పటికీ తెలియరాలేదు. ఆయన్ని గుర్తించిన వారు వెంటనే బంగారుపాలెం పోలీసులను సంప్రదించవలసిందిగా అధికారులు కోరారు. మరిన్ని వివరాలకు 9440796736 నంబర్‌కి ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.