MBNR: జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ క్లబ్లో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్లబ్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సూచించారు. క్లబ్ జిల్లా వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిందన్నారు. క్లబ్ కోసం నూతనంగా భవనం కూడా నిర్మాణం జరుపుకుంటుందని వెల్లడించారు.