ADB: గాదిగూడ మండలంలోని ఖడోడిలో శనివారం పెద్ద పులి సంచరించి 4 ఎద్దులపై దాడి చేసిన ఘటన తెలిసిందే. దీంతో ఉమ్మడి నార్నూర్ మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు వెంటనే పులిని పట్టుకొని అడవిలోకి విడుదల చేయాలనీ ఆదివారం మహార్ బెటాలియన్ అధ్యక్షుడు జాడే రాజేందర్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భీంరావు, కేశవ్ రావు, సునీల్ ఉన్నారు.