KRNL: కర్నూలు బస్సు ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదైంది. A1గా వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్, A2గా వేమూరి కావేరి ట్రావెల్స్ యజమానిని పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. రమేశ్ అనే ప్రయాణికుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తేల్చారు. డ్రైవర్‌తో పాటు యజమానిపై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.