MDK: మనోహరాబాద్ మండలం పరికిబండ పంచాయతీ పరిధి తుపాకులపల్లి గ్రామంలో అంగన్వాడి చిన్నారులు చెట్లకిందే చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంగన్వాడీ కేంద్రానికి భవనం లేకపోవడంతో ప్రాథమిక పాఠశాలలోని వంటశాలను అప్పగించారు. వంటశాల సామాగ్రికే సరిపోవడంతో చిన్నారులను చెట్ల కింద కూర్చోబెట్టి బోధిస్తున్నారు. అధికారులు స్పందించి భవనం నిర్మించాలని కోరుతున్నారు.