E.G: రాజమండ్రిని నిత్యం పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. ఆదివారం ఉదయం ఆయన వీఎల్ పురం పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఘన వ్యర్థాలతో తయారుచేసిన కళాకృతులను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికుల హాజరుపట్టికను తనిఖీ చేసి ఎన్ని గంటలకు హాజరవుతున్నారో ఆరాతీశారు.