VSP: మద్దిలపాలెంలో ఉన్న విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు మూడవ విడత కౌన్సిలింగ్ సోమవారం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్లు ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపు చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.