CTR: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు డీఈవో వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. అన్ని యాజమాన్య పాఠశాలలు సెలవు పాటించాలని అందులో ఆదేశించారు. తల్లిదండ్రులు పిల్లలను నదులు, కాలువలు దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.