KDP: మైదుకూరు (M) శివపురం గ్రామ సమీప పొలాలలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ మేరకు ప్రధాన రహదారి పక్కనే స్తంభాలు ఒరిగి ఉండటంతో ఎప్పుడు కూలిపోతాయో అని రాకపోకలు సాగించే ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో విద్యుత్ స్తంభాలను సరి చేయాలని పలుమార్లు అధికారులను కోరినా చర్యలు లేవన్నారు. స్తంభాల నేలకొరిగి ఉండటం వలన తీగలు కూడా కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి.