TG: నాగర్‌కర్నూల్‌కు చెందిన మేకల అయ్యప్ప కొడుకు మేకల జగతి నిశ్చితార్థం గోవాలో జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులను విమానంలో గోవాకు తీసుకెళ్లాలని అయ్యప్ప నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు కొడుకుకు ఈ విషయాన్ని చెప్పాడు. తన తండ్రి కోరిక మేరకు గ్రామానికి చెందిన 500 మంది రైతు కుటుంబాలను, బంధువులను శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 2 విమానాల్లో గోవాకు తరలించారు.