KMM: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్‌కు కోరమాండల్ కంపెనీకి చెందిన 2,518 టన్నుల యూరియా చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,158 టన్నులు, భద్రాద్రి జిల్లాకు 830 టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 300 టన్నులు కేటాయించినట్లు రేక్ పాయింట్ ఇన్ఛార్జ్ పవన్ కుమార్ తెలిపారు. మిగతా యూరియా బఫర్ స్టాక్‌గా నిల్వ చేస్తున్నట్లు వెల్లడించారు.