కర్నూలులోని వెంకటాద్రి నగరంలో నివాసముంటున్న బొమ్మిరెడ్డి గిరిజా (25) అనే యువతి ఎంబీబీఎస్ పూర్తి చేసి, మహారాష్ట్రలో పీజీ చదువుతున్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. చదువు ఒత్తిడి వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వివరించారు.