ప్రకాశం: మార్కాపురం డివిజన్లో సోమవారం జరగాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసి ఒంగోలులోనే నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు తెలిపారు. వర్షాల కారణంగా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ భవన్లోనే ‘మీ కోసం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మార్కాపురం డివిజన్లోని ప్రజలు,ఇతర ప్రాంతాల ప్రజలు ఈవిషయంను గమనించాలని కోరారు.