MBNR: జడ్చర్ల టౌన్ పరిధిలోని శాంతి నగర్, శ్రీరామ్ నగర్ ప్రాంతాల్లో ఆదివారం ఎస్పీ డి. జానకి ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 150 ఇళ్లను సోదా చేసి, సరైన పత్రాలు లేని 19 మోటార్ బైకులను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న ఆరు ఆటో రిక్షాలను ధ్రువీకరణ కోసం నిలిపివేశారు.