AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్ద బొడ్డుపల్లి విశాఖ డైరీ వద్ద ఇవాళ తెల్లవారుజామున భారీ వృక్షం నేల కూలింది. దీంతో ఆ రహదారిలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఫిర్యాదు రావడంతో ఫైర్ ఆఫీసర్ అప్పలస్వామి ఆధ్వర్యంలో సిబ్బంది హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది వద్ద ఉన్న పవర్స్ పరికరాలుతో చెట్టు కొమ్మలు నరికి దారి క్లియర్ చేశారు.