WGL: రాయపర్తి మండల కేంద్రంలోని మన్నా చర్చిలో మౌలిక సదుపాయాల కోసం బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి రూ.50,000 విరాళం అందజేశారు. ఆదివారం చర్చిలో క్రైస్తవ సోదరులతో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పాస్టర్ నెల్సన్ విజ్ఞప్తి మేరకు తక్షణ సహాయంగా నగదు అందజేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల నాయకులు ఉన్నారు.