WGL: సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ అధ్యక్షుడు కుడికాల రమేశ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ వార్త తెలుసుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుతానని అన్నారు. కార్యక్రమంలో మండల, గ్రామ, యూత్ నాయకులు పాల్గొన్నారు.