జనగామ: జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కె. జితేందర్ రెడ్డి తన వ్యక్తిగత పనుల నిమిత్తం వారం రోజుల సెలవులు పూర్తి చేసుకొని విధుల్లో తిరిగి చేరారు. ఆయన సెలవులో ఉన్నప్పుడు ఇంఛార్జి డీఐఈవోగా ఎస్. శ్రీనివాస్ బాధ్యతలు నిర్వర్తించారు. జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సిలబస్‌పై ఆరా తీస్తూ, త్వరగా పూర్తి చేసి రివిజన్ చేయాలని ఆదేశించారు.