NZB: శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్‌లోకి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు ఆదివారం ఉదయం వరద గేట్లను మూసి వేశారు. ఎస్సారెస్పీలోకి నిన్నటి వరకు ఇన్‌ఫ్లో ఎక్కువగా రావడంతో అధికారులు వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. అయితే ఇన్‌ఫ్లో తగ్గడంతో ఆదివారం గేట్లను మూసివేశారు. జలాశయంలోకి ప్రస్తుతం 9,654 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.