అన్నమయ్య: కోడూరులో ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (AITUC) నేతలు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వాన్ని భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ క్లైయిమ్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో 46,000 పైగా క్లైయిమ్ల పెండింగ్లో ఉన్నాయని, వందల కోట్ల సెస్ నిధులు కార్మిక సంక్షేమానికి వినియోగించలేదని వారు ఆరోపించారు.