అన్నమయ్య: మెంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాయచోటి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వెంకటరామిరెడ్డి సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వరదలు, చెరువులు తెగిపోవడం వంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో వెంటనే ఫైర్ స్టేషన్ 101కు సమాచారం ఇవ్వాలన్నారు. రెస్క్యూ టీమ్ తక్షణమే స్పందిస్తుందని తెలిపారు. విపత్తుల సమయంలో అగ్నిమాపక శాఖ 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు.