ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపుర్ గార్బేజ్ కేఫ్ వినూత్నంగా పర్యావరణానికి సేవలు అందిస్తోందని ప్రధాని మోదీ అభినందించారు. అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలను ఇచ్చి ఫుల్ మిల్స్ తినొచ్చని, కిలో వ్యర్థాలు ఇస్తే.. లంచ్ లేదా డిన్నర్ ఏర్పాటు చేస్తారని చెప్పారు. అర కిలో ఇస్తే అల్పాహారం ఇస్తారని, ఈ కేఫ్‌ను అంబికాపుర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తోందని పేర్కొన్నారు.