SRD: కల్హేర్ మండలం కృష్ణాపూర్ గ్రామంలో ఐకేపీ ద్వారా ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ జడ్పీటీసీ ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కల్హేర్, నిజాంపేట మండలం 4 క్లస్టర్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతి గింజను (వరి) కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. రైస్ మిల్లర్స్తో మాట్లాడి ధాన్యం రవాణాకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.