PDPL: గోదావరిఖని వన్అన్ పోలీస్ స్టేషన్లో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా శనివారం విద్యార్థులకు ‘ఓపెన్ హౌస్’ నిర్వహించారు. పోలీసులు ఉపయోగిస్తున్న టెక్నాలజీ, డయల్ 100, షీ టీమ్ పనితీరుపై అవగాహన కల్పించారు. సైబర్ క్రైమ్స్, ఆయుధాలు భద్రపరిచే రూమ్, సమాజంలో పోలీసు పాత్ర వంటి విషయాలను విద్యార్థులకు వివరించారు.