PLD: నాదెండ్ల మండలం గణపవరంలో భారీ దొంగతనం జరిగింది. లిఫ్ట్ ఇరిగేషన్ ట్రాన్స్ఫార్మర్ను పగలగొట్టి రూ.6 లక్షలు విలువ చేసే రాగి తీగను దొంగలు అపహరించారు. అంతేకాక, వీరాంజనేయ స్వామి దేవస్థానంలో కూడా రూ.50 వేలు విలువైన వస్తువులను చోరీ చేశారు. మొత్తం రూ.6.50 లక్షలు విలువైన సొత్తు అపహరణకు గురైందని ఎస్సై పుల్లారావు తెలిపారు.