W.G: నరసాపురం మండలం సీతారాంపురం గ్రామంలో ఉన్న మిషన్ ఆఫ్ హోప్ బాలుర వసతి గృహాన్ని శనివారం నరసాపురం సీనియర్ సివిల్ జడ్జి జి. గంగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాలు, వంటగది, బాలురు నిద్రిస్తున్న గదులను పరిశీలించారు. హాస్టల్ బాలురను, ఆహార పదార్థాలు, ఆరోగ్యం, యాజమాన్యం అందిస్తున్న సదుపాయాలపై ఆరా తీశారు.