BHPL: చిట్యాల మండల కేంద్రానికి చెందిన అంబేద్కర్ యువజన సంఘం నాయకుడు కిరణ్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. స్ఫూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా NGO వ్యవస్థాపకుడు డా. రమేష్ ఈ విషయాన్ని ఇవాళ తెలిపారు. 15 ఏళ్లుగా బడుగు బలహీన వర్గాల కోసం, అంబేద్కర్ ఆశయాలతో సామాజిక సేవలు చేసిన కిరణ్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. నవంబర్ 5న HYDలో అవార్డు అందజేయనున్నారు.