NRPT: దామకగిద్ద(M)లోని వత్తుగుండ్లలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల వంటగదిని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నూతన వంటగదిని సద్వినియోగం చేసుకోవాలని వంట సిబ్బందికి సూచించారు. పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఉపాధ్యాయ బృందాన్ని కోరారు. దీంతో ఎమ్మెల్యేకు గ్రామస్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.