NZB: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ నగరంలో చోటు చేసుకుంది. నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు.. డిచ్పల్లి మండలం గొల్లపల్లికి చెందిన ఆకాష్ నగరంలోని వినాయకుల బావి దగ్గర అద్దెకు ఉంటున్నాడు. ఉంటున్న ఇంట్లో శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.