HNK: కాకతీయ యూనివర్సిటీలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు సామాజిక వర్గాల వారీగా హాస్టల్స్ డిపాజిట్లను నిర్ణయించారు. ఓసీ కేటగిరీ అభ్యర్థులు రూ.12,200, బీసీ కేటగిరి అభ్యర్థులు రూ.10,200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 8,200 చెల్లించాల్సి ఉంది. అన్ని కేటగిరీలకు చెందిన దివ్యాంగులు ఎలాంటి ఫీజులు చెల్లించనవసరం లేదని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.