MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల క్షేత్రంలో మంగళవారం తెల్లవారుజామున అమ్మవారికి ప్రధాన అర్చకులు శంకర్ శర్మ విశేష పూజలు నిర్వహించారు. కార్తీకమాసం శుక్లపక్షం సప్తమి తిథిని పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్రంగా జలంతో అభిషేకం చేశారు. అనంతరం ధూప దీప నైవేద్యం సమర్పించి మంగళహారతి చేశారు.