ASF: సైబర్ నేరాలకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. గత మే 21న వాట్సాప్ లింక్ పంపించి ఆసిఫాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి సైబర్ మోసగాళ్లు రూ.1.66 లక్షలు కాజేశారు. అదే నెల 27న బాధితుడు ఆసిఫాబాద్ పోలిస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు.