BHPL: మంత్రి వాకిటి శ్రీహరి మంగళవారం నియోజకవర్గ పర్యటనకు రానున్నారని, దీన్ని విజయవంతం చేయాలని MLA గండ్ర పిలుపునిచ్చారు. ఉదయం 9:30కి HYD నుంచి బయలుదేరి 12:30కి రేగొండలో పశువులకు గాలికుంటు టీకాలు ప్రారంభిస్తారు. 1 గంటకు గణపురంలో చేప పిల్లల పంపిణీ, పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఎమ్మెల్యే కోరారు.