కోనసీమ: యానాం పుదుచ్చేరి పరిధిలో రెవెన్యూ, ప్రకృతి వైపరీత్య నిర్వహణ శాఖలో వీఏవో, తూనికలు కొలతల శాఖలో ఎంటీఎస్ పోస్టుల భర్తీకి ఈనెల 26న నిర్వహించనున్న నైపుణ్య పరీక్షను నవంబరు 2కి వాయిదా వేసినట్లు పాలనా సంస్కరణల విభాగం అధికారి వి. జైశంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. పుదుచ్చేరి వ్యాప్తంగా అతి భారీవర్షాలు కురుస్తుండటంతో పరీక్ష వాయిదా వేశామన్నారు.