CTR: నగరి మున్సిపాలిటీ ఏకాంబరకుప్పం నందు షష్టిపూర్తి మహోత్సవం ఐదో రోజు సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వల్లి దేవి సమేత స్వామివారికి ఆలయంలో ఘనంగా పూజా మహోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రోజా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పూజారులు మంత్రోచ్ఛారణల మధ్య మాజీ మంత్రి రోజాకు ఆశీర్వచనాలు అందించారు.