KMM: ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సారథ్యంలో సింగరేణి సంస్థ, టాస్క్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సత్తుపల్లిలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. సుమారు 80 కంపెనీల ద్వారా 5 వేలకు పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయని కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ తెలిపారు. నిరుద్యోగ యువత జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.