ATP: గుత్తి మండలం తొండపాడు గ్రామంలో కుటుంబ కలహాల కారణంగా మాటమాట పెరిగి శనివారం రాత్రి అల్లుడు హరి పై మామ పుల్లన్న కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో హరీకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనలు మేరకు మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. ఆదివారం ఉదయం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.