HYD: ఐటీ కారిడార్‌పై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో సుమారు 82 లక్షల వాహనాలు తిరుగుతుండగా, వాటిలో ఐటీ కారిడార్ వైపు ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అదనపు బస్సులు, సౌకర్యవంతమైన సర్వీసులు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.