WGL: వ్యవసాయ పనిముట్ల కోసం ఈ నెల 30లోపు రైతు వేదికలో దరఖాస్తు చేయాలని నల్లబెల్లి మండల AO రజిత ఆదివారం తెలిపారు. బ్యాటరీ స్పియర్స్-147, పవర్ స్ప్రేయర్-31, ట్రాక్టర్ పనిముట్లు, బ్రష్ కటర్స్-02, పవర్ వీడర్స్-01, స్ట్రా బేలర్-02, పవర్ టిల్లర్-01 అందుబాటులో ఉన్నాయన్నారు. SC, ST, జనరల్ మహిళా రైతులకు 50%, ఇతరులకు 40% సబ్సిడీ లభిస్తుందని వెల్లడించారు.