భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని, ఆయన నాయకత్వం అద్భుతమని US ప్రముఖ గాయని మేరీ మిల్బెన్ ప్రశంసించారు. అలాగే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘భారత్కు నాయకత్వం వహించేందుకు రాహుల్ తగిన వ్యక్తి కాదు. భారత ప్రజలు మూడుసార్లు తమ ఓటు ద్వారా మోదీనే ఉత్తమ నాయకుడని తీర్పు ఇచ్చారు’ అని ఆమె వ్యాఖ్యానించారు.