ఇస్తాంబుల్‌లో ఆఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న చర్చలు విఫలమైతే బహిరంగ యుద్ధమేనని పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహ్మద్ ఆసిఫ్ తెలిపారు. ‘చర్చల్లో ఒప్పందం కుదరకుంటే యుద్ధం చేసేందుకు మాకో ఆప్షన్ ఉంది. కానీ అఫ్గాన్ శాంతి కోరుకుంటున్నట్లు అనిపిస్తోంది’ అని అన్నారు. ఈ చర్చలు శనివారమే ప్రారంభం కాగా అంతలోనే పాక్ మంత్రి ఇలా మాట్లాడుతుండటం గమనార్హం.