VKB: దుద్యాల మండలం రోటిబండతండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఈదులకుంట తండావాసుల తాగునీటి కష్టాలు తీరాయి. తాగునీటి కోసం ప్రత్యేక నిధులు కేటాయించడంతో పంచాయతీ కార్యదర్శి జైపాల్ నూతన సింగిల్ ఫేస్ మోటారు కొనుగోలుచేసి శుక్రవారం బోరు మోటారు బిగించడంతో తాండవాసులు సంతోషం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా తాగునీటి కోసం ఇబ్బందులు పడుతూ ఉండేవారమని తండావాసులు వాపోయారు.