WNP: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న శ్రామికులందరికీ ఈ-కేవైసీని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం అన్ని మండలాల ఎంపీడీవోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు సోమవారం వరకు గడువు ఉందని, ఆలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.