NGKL: 61 ఏళ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పించాలని వీఆర్ఏ జేఏసీ కమిటీ సభ్యులు కలెక్టర్ బదావత్ సంతోష్‌కు ఈరోజు వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన జీఓ నం.81, 85 ప్రకారం వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని గత రెండేళ్లుగా డిమాండ్ చేస్తున్నామని వారు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు.