MDK: అన్ని శాఖల అధికారులు ఫైళ్లను ఈ – ఆఫీస్‌లోనే పంపాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మెదక్ జిల్లాలో సమర్థవంతంగా ఈ ఆఫీస్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకు 95 శాతం ఈ – ఆఫీస్ అమలు జరుగుతున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ 2031 ఫైల్స్‌ను ఈ – ఆఫీసులో క్లియర్ చేసి ఆదర్శవంతంగా నిలిచారు. శుక్రవారం నాటికి 100% పైళ్ల క్లియరెన్స్ పరిష్కరించారు.