TG: AP కర్నూల్లో ఘోర ప్రమాదం నేపథ్యంలో ప్రైవేట్ బస్సులపై చర్యలు తీసుకునేందుకు రవాణాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రేపటి నుంచి 6 ప్రత్యేక టీమ్లుగా ఏర్పడి హైదరాబాద్లో తనిఖీలు చేపట్టనున్నారు. నిబంధనలు, భద్రతా ప్రమాణాలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.