TG: రూ.1000 కోసం తలెత్తిన గొడవలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. స్థానిక వట్టేపల్లికి చెందిన సయ్యద్ అప్రోజ్(21) గతంలో తీసుకున్న రూ.1000 కోసం అబ్బు అనే వ్యక్తితో ఇటీవల గొడవ జరిగింది. దీంతో అప్రోజ్ని హత్య చేయాలని అబ్బు ప్లాన్ వేశాడు. అనుకున్నట్లుగానే అప్రోజ్పై కత్తులతో దాడి చేయగా.. తీవ్ర గాయాలతో అతను మృతిచెందాడు.