MBNR: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి కురుమూర్తి స్వామివారు పద్మావతి సతీసమేతంగా శేషవాహనంపై ఊరేగింపులో దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాల మధ్య పల్లకీ సేవ నిర్వహించారు. ప్రధాన ఆలయం నుంచి మోకాళ్ల గుండు వరకు స్వామివారు విహరించారు. భక్తుల గోవింద నామస్మరణతో ఏడుకొండలు మార్మోగాయి.